అ సినిమాకి చిరంజీవి డైరెక్షన్ చేసాడు తెలుసా... !

అ సినిమాకి చిరంజీవి డైరెక్షన్ చేసాడు తెలుసా... !
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు మనకి ఓ హీరోగానే తెలుసు కానీ అయన ఓ సినిమాకి 40 శాతం దర్శకత్వం వహించారు అంటే నమ్ముతారా ? అ సినిమా కూడా అయన నటించిన సినిమానే...

మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు మనకి ఓ హీరోగానే తెలుసు కానీ అయన ఓ సినిమాకి 40 శాతం దర్శకత్వం వహించారు అంటే నమ్ముతారా ? అ సినిమా కూడా అయన నటించిన సినిమానే కావడం విశేషం ఇక్కడ .. చిరంజీవి సినిమాలలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినా గ్యాంగ్ లీడర్ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు చిరు దర్శకత్వం వహించారు .

ఈ విషయాన్నీ సీనియర్ నటుడు నారయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు . గ్యాంగ్ లీడర్ సినిమాకి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు . అయితే అ సినిమా సగం పూర్తి అయ్యాక సినిమా రషెస్ ని చిరు వేసుకొని చూసారు . అనుకున్నంతగా సినిమా రాలేదని చిరు విజయ బాపినీడుకి చెప్పడంతో విజయ బాపినీడు మీరు కూడా ఓ చేయి వేయండి అంటే చిరంజీవి సినిమాలోని కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు .

సినిమాలో భాగంగా మురళీమోహన్ ని చంపే సన్నీవేషం, చిరంజీవి స్నేహితులను వెంబడించి చంపే సన్నీవేషాలు చిరునే చిత్రీకరించారని అయన చెప్పుకొచ్చారు . చిరు తెర మీద పేరు పడని దర్శకుడు అని అన్నారు . ఆ సినిమాలో నారయణరావు ఓ పాత్రను పోషించారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories