logo
సినిమా

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? మెగా హీరోయిన్ మాత్రం కాదు!

Mega Star Chiranjeevi Daughter Sreeja makeover photos
X

శ్రీజ ఫోటోలు (కర్టసీ: ఇంస్టాగ్రం)

Highlights

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు తెరపై ఎంత ప్రభావవంతమైందో చెప్పక్కర్లేదు. మెగాస్టార్ పేరు చెప్పి ఎంతమంది...

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు తెరపై ఎంత ప్రభావవంతమైందో చెప్పక్కర్లేదు. మెగాస్టార్ పేరు చెప్పి ఎంతమంది వెండితెరపై హీరోలుగా వెలిగిపోతున్నారో ప్రత్యేకంగా అనుకోనవసరంలేదు. ఇప్పుడు ఈ ఫోటోకి.. చెబుతున్న విషయానికి సంబంధం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఈ పాటికే మీరు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టే ఉంటారు. అవును.. ఆమె చిరంజీవి చిన్న కూతురు శ్రీజ!

ఒకప్పుడు బొద్దుగా ఉండేది. ఇప్పుడు ఇలా కొత్తగా వెండితెరకు వస్తున్న హీరోయిన్ లా మారిపోయింది. దీనివెనుక ఆమె భర్త దేవ్ ప్రోత్సాహం ఏంతో ఉంది. శ్రీజను తీసుకుని జిమ్ కు వెళ్ళడం.. ఆమెను జాగ్రత్తగా మేకోవర్ చేయడం వెనుక కళ్యాణ్ దేవ్ తపన ఎంతో ఉంది. ఒకప్పటి శ్రీజ ఫోటోలతో ఈ ఫోటోలను పోల్చి చూస్తె ఆశ్చర్యం అనిపించక మానదు. అంత ఇదిగా శ్రీజ మేకోవర్ అయింది. ఈమె ఫోటోలు ఇంస్టాగ్రా,మ్ లో చూసిన మెగా అభిమానులు.. శ్రీజ సినిమాల్లోకి గానీ వస్తుందా అని సందేహపడుతున్నారు. కానీ, అటువంటిది ఏమీ లేదని శ్రీజ చెబుతున్నారు. ఈ క్రెడిట్ అంతా తన భార్తదే అని చెబుతున్నారు. అన్నట్టు ఈ ఫోటోలు తీసింది కూడా కళ్యాణ్ దేవ్. నటుడిగా వెండితెరపై తన ప్రతిభను చాటుకున్న కళ్యాణ్ దేవ్.. ఫోటోగ్రాఫర్ గా కూడా మంచి ప్రావీణ్యం ఉన్నట్టు కనిపిస్తోంది కదూ ఈ ఫోటోలు చూస్తుంటే..

Web TitleMegastar Chiranjeevi Daughter Sreeja Makeover Images Getting Viral in Social Media
Next Story