మీలో సానుభూతి నిండిన ఓ తల్లి హృదయం చూసా.. మెగాస్టార్ ని కదిలించిన వీడియో!

మీలో సానుభూతి నిండిన ఓ తల్లి హృదయం చూసా.. మెగాస్టార్ ని కదిలించిన వీడియో!
x
Highlights

ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడే కదా అసలు మనిషిలో ఉన్న మానవత్వం అనేది బయటకి వచ్చేది

ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడే కదా అసలు మనిషిలో ఉన్న మానవత్వం అనేది బయటకి వచ్చేది ! అవును కరోనా లాంటి కష్ట సమయంలో పక్క వాళ్ళ గురించి ఆలోచించి ముందుకు వచ్చి తమకి తోచిన సహాయం చేస్తూ ఎదుటివారిని అదుకుంటున్నారు. అందులో భాగంగానే ఒడిస్సా లోని ఓ మహిళ ఎస్సై వృద్ధ మహిళలకు స్వయంగా అన్నం తినిపించి తన దాతృత్వాన్ని చాటుకుంది.

ఆ వృద్ద మహిళలకి మతిస్థిమితం లేకపోవడంతో తానే స్వయంగా అన్నం కలిపి మరీ తినిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే ఇంతకీ ఆమె ఎవరు అని ఆరా తీయగా ఒడిశాలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసే సుభశ్రీ నాయక్ అని తెలిసింది. దీనితో ఆమె చేస్తున్న ఈ సామాజిక సేవకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

సుభశ్రీ నాయక్ చేస్తున్న సేవలు మెగాస్టార్ చిరజీవిని సైతం కదిలించాయి. ఆమెను ఎలా అయిన కలవాలని అనుకున్నారు చిరంజీవి . మొత్తానికి పోలీస్ శాఖ సహకారంతో సుభశ్రీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు చిరంజీవి.. ఆమె చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఈ సామాజిక సేవను ఇలానే కొనసాగించాలని చిరంజీవి కోరారు.

"సుభ శ్రీ మీరు వారికి అన్నం తినిపించడం నా మనసును తాకింది. నన్ను చలింపజేసింది. మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. మీలో సానుభూతి నిండిన ఓ తల్లి హృదయం చూసా... ఇది ఎంతో మందికి స్ఫూర్తి" అని చిరంజీవి అన్నారు. సుభశ్రీ నాయక్ తో చిరు మాట్లాడిన వీడియోను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనతో వీడియో కాల్‌లో మాట్లాడటం పట్ల పొలీస్ అధికారి సుభశ్రీ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories