నన్ను గౌరవిస్తున్నాడు.. అనుకుంటే అనుమానిస్తున్నాడు‌

నన్ను గౌరవిస్తున్నాడు.. అనుకుంటే  అనుమానిస్తున్నాడు‌
x
Nikhil Arjun suravaram Movie
Highlights

గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుమానిస్తున్నాడు అని చిరంజీవి నిఖిల్ పై ఛలోక్తి విసిరారు. నా చెవిలో నిఖిల్ అని మాత్రమే చెప్పారు నిఖిల్ సిదర్ధాగా నాకు గుర్తు అని చిరంజీవి అన్నారు.

నిఖిల్‌ నాకు మరో తమ్ముడు లాంటి వాడని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా 'అర్జున్ సురవరం' యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నిఖిల్ సినిమాలు తాను చూశానని తెలిపారు. కానీ, నిఖిల్‌ను చూసే అవకాశం నాకు ఇప్పడు కలిగిందన్నారు. నిఖిల్ రూపం తమ్ముడు శిష్యుడు దొరికాడని భావిస్తున్నా, అభిమానించే వ్యక్తలు ఉండడం గొప్పగా భావిస్తా. ప్రేమించే వ్యక్తులను పొందడం నా క్రెడిబిలిటీ, బ్యాంక్ బ్యాలెన్స్‌గా అనుకుంటా. నిఖిల్ పరిచయం వలన నా బ్యాలెన్స్ పెరిగిందని అనుకుటాను అని చిరంజీవి ఛలోక్తి విసిరారు.

చిరంజీవి మాట్లాడుతుంటే నిఖిల్ తన పేరు చిరంజీవి చెవిలో చెప్పారు. దీంతో చిరంజీవి నవ్వుతూ.. నాకు మతిమరుపు అనుకుని నిఖీల్ తన పేరు నాకు చెబుతున్నారు. గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుమానిస్తున్నాడు అని చిరంజీవి నిఖిల్ పై ఛలోక్తి విసిరారు. నా చెవిలో నిఖిల్ అని మాత్రమే చెప్పారు నిఖిల్ సిదర్ధాగా నాకు గుర్తు అని చిరంజీవి అన్నారు. యాక్షన్ హీరోగా నిఖిల్ తెర మీదికి ప్రెజెంట్ చేసుకోవడం సినిమాతోనేనని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు చూడదగిన సినిమాఅన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. నిఖిల్ నటించిన ఈ చిత్రం నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నడుస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఏల్ఏల్పీ బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైనా ఈ చిత్రం టీజర్, టైలర్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories