మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న మెగా హీరో

Mega Hero Vaishnav Tej Preparing to Make a Mass Movie | Tollywood News
x

మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న మెగా హీరో

Highlights

మాస్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న మెగా హీరో

Vaishnav Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తన సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెగాహీరో ట్యాగ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" వంటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక ప్రేమకథతో హీరోగా మారారు.

వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా "కొండపొలం" ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఇప్పుడు వైష్ణవ్ తేజ్ "రంగ రంగ వైభవంగా" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. గిరీషయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే తన నాలుగవ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ ఒక మాస్ సినిమాని ఎంచుకున్నట్లు గా తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక పక్కా మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన జూన్ 22న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories