త్రివిక్రమ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చిన మెగా హీరో

Mega hero Sai Dharam Tej Had to be on the Waiting List for Trivikram Srinivas
x

త్రివిక్రమ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చిన మెగా హీరో

Highlights

త్రివిక్రమ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చిన మెగా హీరో

Trivikram Srinivas: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా మహేష్ బాబు తో ఒక సినిమా ఉన్నాయి. సముతిరఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయసితం" సినిమా రీమేక్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ని అందిస్తున్నారు.

ఇక "అతడు", "ఖలేజా" వంటి బ్లాక్ బస్టర్లు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలు పెడతారని ఆ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న సాయి తేజ్ మరియు సినిమాకి దర్శకత్వం వహించాల్సిన సముతిరఖని కూడా మిగతా ప్రాజెక్టుల వైపు దృష్టి పెట్టనివ్వకుండా ఆపేసి ఈ సినిమా కోసం వెయిట్ చేయించారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ పనులతో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ వల్ల ఎదురు చూడకుండా సముతిరఖని మరియు సాయి తేజ్ వేరే సినిమాల పై దృష్టి పెడితే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు మహేష్ బాబు అభిమానులు కూడా ఇకనైనా పవన్ కళ్యాణ్ సినిమాకి డైలాగులను రాసే పని సాయి మాధవ్ బుర్ర వంటి డైలాగ్ రైటర్లకు వదిలేసి మహేష్ బాబు సినిమాపై త్రివిక్రమ్ దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories