చార్మిని ట్రోల్ చేస్తున్న మెగా అభిమానులు

Mega Fans Trolling Charmy Kaur
x

చార్మిని ట్రోల్ చేస్తున్న మెగా అభిమానులు 

Highlights

Charmy Kaur: చార్మి మీద పగ తీర్చుకున్న మెగా అభిమానులు

Charmy Kaur: తాజాగా చార్మి నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లైగర్" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అందరూ చార్మిని ట్రోల్ చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం వలనే ఆమెకి ఇలా జరిగిందని కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. వివరాల్లోకి వెళితే గతంలో మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమా కోసం పూరి జగన్నాథ్ రాసిన "ఆటో జానీ" అనే స్క్రిప్ట్ విన్నారు. చిరుకి స్క్రిప్ట్ బాగానే నచ్చినప్పటికీ తర్వాత కొన్ని వివాదాల వల్ల స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చిరంజీవికి నచ్చలేదు. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ గ్యాప్ లో చిరంజీవి శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన "బ్రూస్లీ" సినిమాలో క్యామియో పాత్రలో కనిపించారు. కానీ ఆ సినిమా మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను అందుకుంది.

ఈ నేపథ్యంలో చార్మి అప్పుడు నవ్వుతున్నట్లుగా ఒక ఇండైరెక్టు ట్వీట్ చేసింది. దీనితో మెగా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. తాజాగా ఇప్పుడు "లైగర్" సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులు చార్మిని కర్మ సిద్ధాంతం అంటే ఇలానే ఉంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి లైగర్ సినిమా విడుదల కి ముందు చార్మి మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకొని సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా చెప్పుకొచ్చింది. కానీ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి నెగటివ్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో చార్మి కన్నీళ్లు కూడా సినిమాని కాపాడలేకపోయాయి అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories