సాయి ధరమ్ తేజ్ కి మెగా హీరో ట్యాగ్ ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందా?

Mega Fans Forget Sai Dharam Tej | Tollywood News
x

సాయి ధరమ్ తేజ్ కి మెగా హీరో ట్యాగ్ ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందా?

Highlights

సాయి ధరమ్ తేజ్ ని మర్చిపోయిన మెగా అభిమానులు

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు. ఆ చిత్రం తర్వాత చాలా కాలం రెస్ట్ తీసుకున్న సాయి ధరంతేజ్ కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కరియర్ లో ఈ మధ్య ఒక మంచి హిట్ సినిమా కూడా లేదు.

చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సాయిధరమ్తేజ్ ని అభిమానులు చాలా వరకు మర్చిపోయారు. ఆఖరికి మీడియా కూడా సాయి ధరమ్ తేజ్ గురించిన వార్తలు విడుదల చేయడం లేదు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ చిత్తం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై అంత ఆసక్తి చూపించడం లేదు.

ఈ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో, అభిమానులు మరో మెగా కాంబినేషన్ సినిమా గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి వంటి యువ హీరోలు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ కూడా తన మెగా హీరో ట్యాగ్ ను పక్కన పెట్టి మంచి సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories