logo
సినిమా

కోన వెంకట్ పై మండిపడుతున్న మెగా అభిమానులు

కోన వెంకట్ పై మండిపడుతున్న మెగా అభిమానులు
X
Highlights

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో పాటుగా...

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో పాటుగా సినీ స్టార్లు కూడా శుభాంక్షలు తెలియజేశారు పాపులర్ రైటర్ కోన వెంకట్ కూడా సోషల్ మీడియా ద్వారా చరణ్ కు విషెస్ చెప్పాడు. "బంగారం లాంటి మనసున్న రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ మెగా పవర్ స్టార్" అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేయడం బాగానే ఉంది కానీ దాని కింద నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా బూతులు కూడా తిట్టేస్తున్నారు. దానికి కారణం కోన వెంకట్ పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేయడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్ తన ప్రసంగాలతో ద్వేషాలను రగిలిస్తున్నాడని, తెలంగాణలో విద్వేషాలను రగిలించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నాడు కోన. పవన్ కు సన్నిహితుడిగా చెప్పుకునే కోన ఇలా రివర్స్ అయ్యి పవన్ పై ఘాటు విమర్శలు చేసే సరికి కోనపై మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే దీనిపై కోన రెండు మూడు పేజీల్లో సుదీర్ఘ వివరణను ఇచ్చాడు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. మరి మెగా అభిమానులు ముఖ్యంగా పవన్ అభిమానులు ఎప్పుడు కోన పై కరుణ చూపిస్తారో చూద్దాం.

Next Story