పుష్ప విషయంలో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్న మెగా అభిమానులు

Mega Fans Buzzing on Social Media About the Pushpa Movie | Telugu Movie News
x

పుష్ప విషయంలో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్న మెగా అభిమానులు

Highlights

పుష్పరాజ్ వర్సెస్ చిట్టి బాబు.. ఎవరు గెలుస్తారు?

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ మధ్యనే 'పుష్ప: ది రైజ్" సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా భారీ హిట్ అవడానికి గల కారణాల్లో అల్లుఅర్జున్ పర్ఫామెన్స్ కూడా ఒకటని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ నటన కి ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని సుకుమార్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన "రంగస్థలం" తో పోలుస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లేక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎవరు బాగా నటించారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానులు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. నిజానికి రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇద్దరూ తమ అద్భుతమైన నటనతో తమ పాత్రలకు ప్రాణం పోసారు. కానీ రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ పాత్ర కంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పాత్ర కొంచెం కష్టమైనది కాబట్టి బన్నీ నే బాగా నటించాడు అని కొందరు అభిమానులు చెబుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు మాత్రం పుష్ప సినిమా ఈ మధ్యనే విడుదల అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇంకా పోలేదని అందుకే ఆ సినిమా ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories