
సంక్రాంతి పర్వదినాన సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట కలిపించి అభిమనులకు కనువిందు కలిగించారు.
సంక్రాంతి పర్వదినాన సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట కలిపించి అభిమనులకు కనువిందు కలిగించారు. మెగా స్టార్ ఫ్యామిలీ అంతా ఒకే చోట సంక్రాంతి పండగ జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఫోటో తోపాటు హ్యాపీ సంక్రాంతి అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు , రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లతో పాటుగా పవన్ కల్యాణ్, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ కూడా ఈ ఫోటో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి పంచెకట్టులో కలిపిస్తున్నారు. ఇక మిగిలిన మెగా హీరులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నలుపు నిలీరంగు దుస్తువుల్లో ఉన్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఓ ఫోటోను క్యాష్షన్ చేశారు. మంగళవారం ఈ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు హ్యాపీ బోగీ అని క్యాప్షన్ ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152 సినిమా రానుంది. అల్ల అర్జున్ హీరోగా మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల..వైకుంఠపురంలో.. సంక్రాంతి విడుదలై సూపర్ హిట్ సాధించింది. బాక్సాఫీసు ముందు భారీ వసూళ్లు రాబట్టింది. రామ్ చరణ్, వరణ్ తేజ్, ఇతర సినిమాల్లో బీజీగా ఉన్నారు. సంక్రాంతి పండుగా పూట మెగా కుటుంబ వారుసలంతా ఒకేచోట ఉండటంతో అభిమాను సంబరాల్లో మునిగిపోయారు.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండిన Ram Charan (@alwaysramcharan) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




