మెగా - అల్లు కలయిక పై ఫైర్ అవుతున్న అభిమానులు

Mega Allu Reunion at Gopichand Film Festival
x

గోపీచంద్ సినిమా వేడుకలో మెగా అల్లు రీయూనియన్

Highlights

Mega Allu Reunion: మెగా - అల్లు కలయిక పై ఫైర్ అవుతున్న అభిమానులు

Mega Allu Reunion: మెగా ఫ్యామిలీ లో చీలికలు వచ్చాయి అని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రతిసారి మెగా కాంపౌండ్ కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ముద్రని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ బోలెడు రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మెగా మరియు అల్లు అభిమానుల మధ్య గొడవలు కూడా జరిగాయి.

అయితే తాజాగా విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ ప్రైవేట్ మీట్ లో కొందరు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కానీ అల్లు ఫ్యామిలీకి చెందిన గీత ఆర్ట్స్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావటంతో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడింది. తాజాగా అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న "పక్కా కమర్షియల్" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్, రాశి ఖన్నా లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యనే హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి ఈ వేడుక కు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ నేపథ్యంలో వేదికపై మాట్లాడుతూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పడానికి ప్రయత్నించారు. దీంతో అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా కంటే మెగా రీయూనియన్ లాగా కనిపించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వేదికపై కనిపించిన బన్నీ వాస్, మారుతి వంటి వారు కూడా గోపీచంద్ ను వదిలేసి చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించటం ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు కుటుంబాల కలయికతో మెగా అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories