Meenakshi Chaudhary: ప్రభాస్ సరసన నటించడం లేదు అంటున్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Says She is not Acting With Prabhas | Tollywood News
x

ప్రభాస్ సరసన నటించడం లేదు అంటున్న మీనాక్షి చౌదరి

Highlights

Meenakshi Chaudhary: ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ హీరోయిన్

Meenakshi Chaudhary: యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మధ్యనే మిస్ ఇండియా కాంపిటేషన్ తో పాప్యులర్ అయింది. తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సరసన "ఖిలాడి" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 11న విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్స్ తో బిజీగా ఉన్న రవితేజ చిత్ర ప్రమోషన్స్ కి రాలేకపోవడంతో ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రమోషన్ల బాధ్యతను తీసుకొని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీనాక్షి ఈ సినిమాలో తాను నటించిన లిప్ లాక్ సన్నివేశం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

స్క్రిప్టు మరియు తన క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా తనకి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది మీనాక్షి. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాలో మీనాక్షి చౌదరి ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజాగా ఈ రూమర్లపై రియాక్ట్ అయిన మీనాక్షి చౌదరి ఇప్పటిదాకా ఆ పాత్ర కోసం తననెవరూ సంప్రదించలేదని కాబట్టి సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. "కేజిఎఫ్" ప్రశాంతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories