logo
సినిమా

షూటింగ్ షురూ చేసిన రవితేజ

షూటింగ్ షురూ చేసిన రవితేజ
X
Highlights

వరుసగా 3 డిజాస్టర్లు అందుకోవడంతో మాస్ మహారాజా రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు....

వరుసగా 3 డిజాస్టర్లు అందుకోవడంతో మాస్ మహారాజా రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు. 'అమర్-అక్బర్-ఆంటోనీ' అనే సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం తన ఆశలన్నీ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ దర్శకుడు వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. 'డిస్కో రాజా' అనే సరికొత్త టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రవితేజ కూడా సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ లో రవితేజ కొన్ని మార్పులు చెప్పారని వి ఆనంద్ ఆ మార్పులను చేసే పనిలో బిజీ అయ్యారు అని గత కొంత కాలంగా మనం వార్తలు వింటూ వచ్చాం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయం ఆసన్నమైంది. 'డిస్కో రాజా' ఓపెనింగ్ ఈవెంట్ రేపు జరగనుంది. రేపటి నుంచి షూటింగ్ కూడా పట్టాలెక్కనుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అబ్బూరి రవి ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు.

Next Story