"రాజా డీలక్స్" కోసం యూనివర్సల్ టైటిల్ ప్లాన్ చేస్తున్న మారుతి

Maruthi is Planning a Universal Title For Raja Deluxe
x

"రాజా డీలక్స్" కోసం యూనివర్సల్ టైటిల్ ప్లాన్ చేస్తున్న మారుతి

Highlights

Maruthi: "రాజా డీలక్స్" టైటిల్ విషయంలో మారుతి జాగ్రత్తలు

Maruthi: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలానే బడా ప్రాజెక్టులో ఉన్నాయి. అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలలోనే నటిస్తున్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సైన్ చేశారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. దీనికి కారణం లేకపోలేదు. ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి టైటిల్ కూడా యూనివ‌ర్స‌ల్ గానే ఉండాలి.

అన్నీ భాష‌ల్లోనూ ఒకే టైటిల్ తో సినిమా విడుద‌ల చేయాలి. అందుకే అంద‌రికీ అర్థ‌మ‌య్యే లాగా మంచి క్యాచీ టైటిల్ కోసం చూస్తున్నాడు మారుతి. ఇక ఇది ఒక థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌. హార‌ర్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయట. బొమ‌న్ ఇరానీని సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయనున్నట్టు స‌మాచారం. తాత‌ల నాటి ఆస్తి కోసం ప్రభాస్ చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో సినిమా కథ సాగుతుందట. న‌వంబ‌రు నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టలెక్కే అవకాశాలు ఎక్కువగా నే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", "ప్రాజెక్ట్ కే", "ఆది పురుష్", "స్పిరిట్" వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories