Marakkar: ఇదెక్కడి విడ్డూరం.. రిలీజ్ కాకుండానే జాతీయ అవార్డా?

Mohanlal Markkar Movie
x

మార్కర్ మూవీ 

Highlights

Marakkar: మోహన్ లాల్ మర్ క్కార్ సినిమా రిలీజ్ కాకుండానే జాతీయ అవార్డులు రావడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Marakkar: కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్ఢుల్లో తెలుగు సినిమాకు 4 అవార్డులు దక్కాయి. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహేశ్‌ బాబు నటించిన 'మహర్షి' మూవీ ఎంపికవ్వగా..ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన 'జెర్సీ' వచ్చింది. 'జెర్సీ'కి ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. 'మహర్షి' చిత్రానికి కొరియోగ్రాఫి సమకూర్చిన రాజు సుందరం బెస్ట్ కొరియోగ్రాఫర్‌ అవార్డు వరించింది.

కాగా.. మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. ఇంకా రిలీజ్‌ కాని ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు ప్రకటించడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. కరోనావైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. గత ఏడాదే సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. గత ఏడాదే జాతీయ అవార్డులను ప్రకటిచాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ చిత్రం విడుదల కాకుండానే నేషనల్ అవార్డులు రావడంపై నెటిజన్లు సైటైర్లు వేస్తున్నారు. జాతీయ అవార్డులు మోహన్ లాల్ ను చూసి ఇచ్చారా? టైలర్ చూసి ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు?

మరక్కార్‌(అరేబియా సముద్ర సింహం) అనేది ట్యాగ్ లైన్..అన్ని భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్, టీజర్ కు సినిప్రీయుల నుంచి అదిరిపోయే రెస్ఫాన్స్ వచ్చింది. చిత్రం ఈ ఏడాది మే 19న చిత్ర బృందం రిలీజ్‌ చేయనుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్, మహానటి కీర్తి సురేష్, సుహాసిని, మంజు వారియర్ తదితరులు నటిస్తున్నారు. అంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియదర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..రన్నే సంగీతం సమకూర్చారు.



Show Full Article
Print Article
Next Story
More Stories