"రాధే శ్యామ్" క్లైమాక్స్ గురించి గుట్టువిప్పిన మనోజ్ పరమహంస

Manoj Paramahamsa says in an Interview about Radhe Shyam Movie Climax
x

"రాధే శ్యామ్" క్లైమాక్స్ గురించి గుట్టువిప్పిన మనోజ్ పరమహంస(ఫైల్ ఫోటో)

Highlights

* ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది.

Radhe Shyam Climax: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి ఛాయాగ్రహకుడి గా వ్యవహరించిన మనోజ్ పరమహంస తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

*రాధే శ్యామ్ సినిమా క్లైమాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంత సులువైన విషయం కాదు. సినిమా క్లైమాక్స్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి" అని అన్నారు మనోజ్ పరమహంస. ఇప్పటికే ఈ సినిమాకి సాడ్ ఎండింగ్ ఉండబోతోందని పలు పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories