logo
సినిమా

తారక్ రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న హీరో

తారక్ రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న హీరో
X
Highlights

వరుస డిజాస్టర్ లతో సతమతమయిన మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు కానీ సోషల్ మీడియా ద్వారా...

వరుస డిజాస్టర్ లతో సతమతమయిన మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో దగ్గరగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఫీజు రియింబర్స్మెట్ తాలూకు బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదూ అంటూ నిన్న తిరుపతిలో చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మంచు మనోజ్ కూడా పాల్గొని వార్తల్లోకి ఎక్కాడు. అయితే దీక్ష గురించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు మంచు మనోజ్. ప్రతీ రూపాయి కష్టార్జీతం అని, దయచేసి నిజాలు తెలుసుకుని మాట్లాడమని జవాబిచ్చారు మనోజ్.

ట్విట్టర్లో తన అబిమానులతో ముచ్చటిస్తున్నప్పుడు వారు అతనిని బోలెడు ప్రశ్నలు అడిగారు కానీ అన్నింటికి ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు మనోజ్. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తారా అని అభిమాని అడిగిన ప్రశ్నకు, తప్పకుండా ఇస్తాను అని చెప్పాడు. మరో అభిమాని "రాబోయే రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు మద్దతు ఇస్తావా" అని అడుగగా దానికి "తారక్ వస్తే ఇంక నేను ఎటు వెళ్లాను తమ్ముడు?! నా మిత్రుడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు." అని జవాబిచ్చాడు. తారక్ తో మనోజ్ పరిచయం ఎప్పుడో చిన్నప్పుడే మొదలైంది. అందుకే ఎన్టీఆర్ అంటే మనోజ్ కు చాలా ఇష్టం.

Next Story