Ala Vaikuntapuramlo: షెహజాదాకి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో..

Manish Shocked the Producers of Ala Vaikunthapurramuloo
x

"అల వైకుంఠపురం లో" రీమేక్ నిర్మాతలకు పెద్ద చిక్కే వచ్చి పడింది

Highlights

Ala Vaikunthapurramuloo: "అల వైకుంఠపురం లో" నిర్మాతలకు షాక్ ఇచ్చిన మనీష్

Ala Vaikunthapurramuloo: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "అల వైకుంఠపురములో" సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో "షెహజాదా" అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది.

వివరాల్లోకి వెళితే సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన నిర్మాత మనీష్ షా మరియు చిత్ర నిర్మాతలకు మధ్య రిలీజ్ విషయంలో వివాదం కొనసాగుతోంది. రీమేక్ సినిమా విడుదల అయ్యేంతవరకు డబ్బింగ్ సినిమా విడుదల చేయొద్దని నిర్మాతలు పట్టుబడుతున్నారు. కానీ డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన మనీష్ మాత్రం ఆలస్యం అయ్యే కొద్ది తనకు భారీగా నష్టం వాటిల్లుతోందని అందుకే డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ డబ్బింగ్ సినిమా కానీ రీమేక్ సినిమా విడుదలయితే తనకు భారీ స్థాయిలో నష్టాలు కలుగుతాయని అందుకే డబ్బింగ్ సినిమాని విడుదల చేయకుండా ఉండాలంటే రీమేక్ సినిమాలో వచ్చిన లాభాల్లో కొంత వాటా కావాలని చెబుతున్నారు. కానీ దీనికి రీమేక్ చిత్ర నిర్మాతలు మాత్రం ఒప్పుకోవటం లేదు. దీంతో నిర్మత మనీష్ రీమేక్ ప్రొడ్యూసర్స్ కు ఛాలెంజ్ విసిరారు. డబ్బింగ్ సినిమాను తన గోల్డ్ మైన్స్ ఛానల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే "పుష్ప" తో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ను ఒరిజినల్ సినిమా లో చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపుతారు. అప్పుడు రీమేక్ చిత్రానికి నష్టం కలిగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories