16 ఏళ్ళ తరువాత మళ్ళీ మణిరత్నం అలా

ఈ మధ్యనే 'చెక్క చివంత వానం (నవాబ్)' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ దర్శకుడు మణిరత్నం దాదాపు 16 ...
ఈ మధ్యనే 'చెక్క చివంత వానం (నవాబ్)' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ దర్శకుడు మణిరత్నం దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మాతగా మారనున్నాడు. అది కూడా తన అసిస్టెంట్ ను దర్శకుడిగా చేసి ఆ సినిమాకు నిర్మాణ వ్యవహారాలు చేపట్టనున్నారు మణిరత్నం. దర్శకుడిగా మారబోతున్న ఆ అసిస్టెంట్ ఏ.డి. ధన శేఖర్. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాను మద్రాస్ టాకీస్ పతాకంపై దర్శకుడు మణిరత్నం నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ ప్రభు మరియు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారట. 'ప్రేమం' సినిమాలో నాగచైతన్య తో నటించిన మడోన్నా సెబాస్టియన్ మరియు 'నవాబ్' సినిమా లో మెరిసిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ వయోలిన్ ప్లేయర్ గోవింద్ వసంత ఇప్పటికే '96' సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఆయన ఇప్పుడు మణిరత్నం సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMT