Kannappa Prabhas Remuneration: క‌న్న‌ప్ప‌ సినిమాకు ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్ రెమ్యునరేషన్‌ ఎంతంటే..!

Manchu Vishnu Revealed Remuneration Of Prabhas And Mohanlal For Kannappa
x

 క‌న్న‌ప్ప‌ సినిమాకు ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్ రెమ్యునరేషన్‌ ఎంతంటే..!

Highlights

అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొంతున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. పలువురు అగ్రహీరోలు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.

Kannappa Prabhas Remuneration: అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. పలువురు అగ్రహీరోలు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్‌తో పాటు తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు అతిథి పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్ సహా ఇతర నటీనటుల ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నారు. ఇక మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఈ మూవీకి ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇద్దరూ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని.. కథ చెప్పగానే ఒప్పుకున్నారని విష్ణు తెలిపారు. తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో వాళ్లిద్దరూ ఈ సినిమాలో నటించారని చెప్పారు. మోహన్ లాల్‌తో తాను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినప్పుడు అతను ఎలా స్పందించారో కూడా విష్ణు తెలిపారు. నువ్వు అంత పెద్దోడివి అయిపోయావని అనుకుంటున్నావా అని మోహన్ లాల్ సరదాగా అన్నారని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు ఎంత వినయంగా ఉంటారో ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుందన్నారు విష్ణు.

అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుని పాత్రలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ పాత్ర కోసం అతన్ని సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించారని అన్నారు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి అతన్ని ఒప్పించామన్నారు. శివుని పాత్రలో చాలా అద్భుతంగా నటించారని విష్ణు తెలిపారు.

సుమారు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో మంచు మోహన్ బాబు కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. పార్వతిగా నటి కాజల్ నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వీళ్లే కాకుండా మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, విష్ణు కూతుర్లు ఆరియానా, వివియానా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories