Prabhas: ఫోన్ కాల్‌కు భయపడ్డ ప్రభాస్.. ఇంతకీ విషయం ఏమిటంటే..

Prabhas: ఫోన్ కాల్‌కు భయపడ్డ ప్రభాస్.. ఇంతకీ విషయం ఏమిటంటే..
x
Highlights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ మూవీలో నటించడం పట్ల తాజాగా మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా పలువురు స్టార్ హీరోలు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ మూవీలో నటించడం పట్ల తాజాగా మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

మార్చి 1న కన్నప్ప టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణు.. నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడ్డాడు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. కన్నప్ప సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్‌కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఒకే చెప్పాడని అన్నారు మంచు విష్ణు. మొదట నాన్న ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని.. తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైన పని ఉంటే నువ్వే కాల్ చేయ్ అని ప్రభాస్ తనతో చెప్పినట్టు తెలిపాడు. అంతేకాదు సినిమాకు ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని గతంలో వివరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం స్టార్‌ హీరోలలో అత్యంత బిజీగా ఉన్న హీరో ప్రభాస్. ప్రస్తుతం అతని చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అంత బిజీగా ఉన్నా కూడా కన్నప్ప సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు ప్రభాస్. ఇదిలా ఉంటే.. కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తదితర స్టార్స్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories