Manchu Manoj: 'అహం బ్రహ్మాస్మి' ఫస్ట్‌లుక్.. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీసిన మనోజ్

Manchu Manoj: అహం బ్రహ్మాస్మి ఫస్ట్‌లుక్.. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీసిన మనోజ్
x
AHAM Brahmasmi
Highlights

టాలీవుడ్ విభిన్న చిత్రాలు తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు మంచు మనోజ్. కాగా.. మంచు మనోజ్ కొంత కాలం విరామం తరవాత ఒక పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

టాలీవుడ్ విభిన్న చిత్రాలు తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు మంచు మనోజ్. కాగా.. మంచు మనోజ్ కొంత కాలం విరామం తరవాత ఒక పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మనోజ్ కథానాయకుగా 'అహం బ్రహ్మాస్మి' తెరకెక్కుతోంది. సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి 'అహం బ్రహ్మాస్మి'ని తొలి చిత్రంగా నిర్మిస్తున్నట్టు మనోజ్ ప్రకటించారు. తాజాగా మనోజ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మూడు డిఫరెంట్ హావభావాలతో మనోజ్ లుక్ అదిరిపోయింది.

ఈ ఫస్ట్‌లుక్‌ను మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''నా కొన్నేళ్ల విరామం తరవాత వెండితెర మీద గట్టిగా అరవడానికి వస్తున్నాను. ఈ క్రైమ్, కామెడీ, యాక్షన్ ఫిల్మ్‌తో మీకు కొన్ని గూస్‌బంప్స్ ఇస్తా'' అని ట్వీట్‌లో మంచు మనోజ్ పేర్కొన్నారు. ఫస్ట్ లుక్‌లో మంచు మనోజ్ విభూది నామాలు, తిలకం దిద్దుకొని కనిపిస్తున్నారు. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్‌కు అద్దం పట్టేలా హాస్యం, రౌద్రం, శాంతం ప్రదర్శిస్తున్నారు.

ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి సంగీతం అందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories