"ఇది నా ఖర్మ" అంటున్న మంచు లక్ష్మి.. మంచు ల‌క్ష్మిని ఎత్తిప‌డేసిన..

Manchu Lakshmi Shares Funny Video Goes Viral
x

"ఇది నా ఖర్మ" అంటున్న మంచు లక్ష్మి.. మంచు ల‌క్ష్మిని ఎత్తిప‌డేసిన..

Highlights

Manchu Lakshmi: సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నటీమణులలో మంచు లక్ష్మి కూడా ఒకరు.

Manchu Lakshmi: సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నటీమణులలో మంచు లక్ష్మి కూడా ఒకరు. ఇంస్టాగ్రామ్ లేదా యూట్యూబ్ చానల్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు మంచు లక్ష్మి భర్త యాండీ ను స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేస్తూ ఉంటే వీడియో తీసింది మంచు లక్ష్మి. ఇప్పుడు ఆ కర్మ తన వద్దకు వచ్చింది అంటూ మంచు లక్ష్మి తనని నీళ్లలోకి తోసేసిన వీడియో ను పంచుకుంది.

ఆమెను ఎత్తుకోగానే మంచు లక్ష్మి నీళ్లలోకి తోయద్దు అంటూ కేకలు పెట్టడం మొదలు పెట్టింది. ఈ లోపు మోహన్ బాబు కూడా వచ్చి విష్ణుకి సహాయం చేస్తూ ఇద్దరు కలిసి ఆమెను నీళ్ళలోకి తోసేశారు. దీంతో విష్ణు మోహన్ బాబు విష్ణు కి సపోర్ట్ చేసినందుకు మోహన్ బాబు పై కూడా అరిచేసింది మంచు లక్ష్మి. "యాండీ ను నీళ్లలోకి పడేస్తున్నప్పుడు నేను చాలా నవ్వాను. ఇప్పుడు కర్మ నా వద్దకు వచ్చింది" అంటూ ఈ సరదా వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది మంచులక్ష్మి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో లో వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories