మల్లేశం రివ్యూ ..

మల్లేశం రివ్యూ ..
x
Highlights

సినిమా: మల్లేశం జానర్‌ : బయోపిక్‌ నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌ దర్శకత్వం : రాజ్‌ ఆర్‌ నిర్మాత : రాజ్‌...

సినిమా: మల్లేశం

జానర్‌ : బయోపిక్‌

నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు

సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌

దర్శకత్వం : రాజ్‌ ఆర్‌

నిర్మాత : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి

ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తుంది .. కానీ ఇప్పటివరకు మనం చూసిన బయోపిక్ లు అన్ని అంతో ఇంతో మనకి తెలిసిన వాళ్ళవే.. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందినా ఓ నేతకార్మికుడి జీవితాన్ని కధగా మలిచి వెండితెరపై ఆవిష్కరించడం అనేది ఇదే మొదటిసారి .. చింతకింద మల్లేశం జీవిత చరిత్రను మల్లేశం గా రూపొందించారు .. మరి ఇది ప్రేక్షకులను ఎ విధంగా ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

కధ : -

ఈ సినిమా కధ 1980-1990 సంవత్సరంలో నడుస్తుంది .. నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో మల్లేశం అనే వ్యక్తి నేతపని చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు .. అయితే అతని తల్లి ఆసు పని చేయడంతో తరుచుగా చేయినొప్పి లేస్తూ ఉంటుంది .. దాదాపుగా ఇలాంటి పరిస్థితి అ గ్రామంలో అందరు అనుభవిస్తూ ఉంటారు .. అయితే దీనికి ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించాలని అనుకుంటాడు మల్లేశం.. ఈ క్రమంలోనే మల్లేశంకి అసుయంత్రం కనిపెట్టాలనే ఆలోచనకి బీజం పడుతుంది .. దానికి మల్లేశం చేయని పని అంటూ ఏమి ఉండదు .. ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకోని అసుయంత్రానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తాడు. ఈ ప్రాసెస్ లో మల్లేశం పడని అవమానాలు అన్ని ఇన్ని కావు .. ప్రతిసారి తన ప్రయత్నంలో విఫలం అవుతూ ఉండడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు మల్లేశం .. కానీ దాని నుండి మల్లేశం ఎలా బయటపడ్డాడు .. చివరికి తానూ అనుకున్నది ఎలా సాధించాడు ? పద్మశ్రీ అవార్డు ఎలా అందుకున్నాడు అన్నది మిగిలిన కధ ..

ఎలా ఉందంటే :-

సినిమాకి కధ ఎంత బలమో దానిని నడిపించే పాత్రలు కుడా అంతే బలంగా ఉండాలి .. సినిమా పాత్రలకు దగ్గ నటినటులను ఎంచుకోవడమే దర్శకుడుకి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి .. ఇది పూర్తి తెలంగాణా మాండలికంలో సాగే కధే అయినప్పటికీ బాష - యాస తో నవ్వించడమే కాకుండా మనుసుకు హత్తుకునే సన్నివేశాలతో కొన్ని సార్లు ఏడిపించాడు కూడా .. వాస్తవ కధ అయినప్పటికీ రంగుల ప్రపంచంలోకి వచ్చేసరికి అంతో ఇంతో పక్కదారి పట్టడం అనేది ఉంటుంది .. కానీ దర్శకుడు మనకి ఎక్కడ కూడా అ ఛాయలు కనిపించేలా చేయలేదు.. మల్లేశం అనే పాత్రతో సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడుని కూడా ట్రావెల్ అయ్యేలా చేసిన దర్శకుడు ప్రతిభకి వావ్ అనాల్సిందే .. సినిమాలోని పాటల చిత్రీకరణలో కూడా తెలంగాణా సంస్కృతీ ని చాలా చక్కగా చూపించాడు ..

నటినటులు :-

ఇప్పటివరకు కామెడి పాత్రలు పోషించిన ప్రియదర్శి ఇలాంటి పాత్రలో అయితే ఎవరు ఉహించుకొని ఉండరు. కానీ మల్లేశం అనే పాత్రకి జీవం పోసాడు ప్రియదర్శి .. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లో తన నటన అద్భుతం అనే చెప్పాలి .. ఇక మల్లేశం కి మరదలు పాత్రలో అనన్య మంచి నటనని కనబరిచింది .. ఇక తల్లిగా యాంకర్ ఝాన్సీ తనదైన మార్క్ ని చూపెట్టింది .. ఇక మిగతా నటినటులు పాత్రాల మేరకు ఒకే అనిపించారు ..

సాంకేతికవర్గం :-

సినిమాకి ప్రధాన ఆకర్షణ కెమరామెన్ పనితనం అనే చెప్పాలి .. అ కాలం నాటి పరిస్థితులను చాలా చక్కగా చూపించాడు .. అనాటి పల్లె అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు . ఎడిటర్ కొంచం కత్తెరకు పని చెప్పాల్సిన అవసరం ఉంది . కె రాబిన్‌ అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ అయింది .. మొత్తానికి మల్లేశం మనసుకు హత్తుకునే సినిమాగా ఉంది చెప్పవచ్చు .. కమర్షల్ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి మరి ..

బాటమ్ లైన్ :-

మనసుకు హత్తుకునే సినిమా ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories