మెగాస్టార్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మలయాళం స్టార్

Malayalam Star Biju Menon Playing the Lead Role in Megastar Chiranjeevi Movie
x

మెగాస్టార్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మలయాళం స్టార్

Highlights

*మెగాస్టార్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మలయాళం స్టార్

Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరు మోహన్ రాజా డైరెక్షన్ లో "గాడ్ ఫాదర్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "వాల్తేర్ వీరయ్య" అనే టైటిల్ ని అనుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాసమాచారం ప్రకారం మలయాళం స్టార్ బిజూ మీనన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. మలయాళం లో స్టార్ స్టేటస్ ఉన్న బిజూ తెలుగులో "రణం", "ఖటర్నాక్" వంటి సినిమాల్లో కనిపించారు.

ఆ తర్వాత తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న బిజూ ఇప్పుడు మళ్లీ చిరు సినిమాతో కం బ్యాక్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. దీని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories