OTT Movie: 'పాతిపెట్టిన నిజాన్ని తీసే సమయం వచ్చేసింది'.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేటింగ్‌ థ్రిల్లర్‌..!

OTT Movie: పాతిపెట్టిన నిజాన్ని తీసే సమయం వచ్చేసింది.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేటింగ్‌ థ్రిల్లర్‌..!
x
Highlights

OTT Movie: ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్‌ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలకు సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.

OTT Movie: ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్‌ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలకు సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లవర్స్‌ని ఆకట్టుకునేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ ఎందులో స్ట్రీమింగ్‌ కానుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల మలయాళ చిత్రాలకు తెలుగులో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, కిష్కింద కాండం, రైఫిల్ క్లబ్ వంటి చిత్రాలు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అసిఫ్‌ అలీ నటించిన రేఖా సినిమా సోని లివ్‌ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ ఏడాది జనవరి 09న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మలయాళ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2025 లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ సినిమాల్లో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది.

ఈ చిత్రాన్ని కేవలం రూ. 6 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా రూ. 55 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 7 నుంచి రేఖా చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సోని లివ్‌ అధికారికంగా ప్రకటించారు. ‘అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి’ అంటూ ఈ వివరాలను ఎక్స్‌ వేదికగా పంచుకుంది చిత్ర యూనిట్. మరి థియేటర్లలో సంచనలం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories