2023 లోనే మహేష్- రాజమౌళి సినిమా?

2023 లోనే మహేష్- రాజమౌళి సినిమా?
x
Rajamouli, Mahesh babu
Highlights

ఆర్.ఆర్.అర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఏంటి అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది.

ఆర్.ఆర్.అర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఏంటి అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది.మహేష్ బాబుతో సినిమా ఉంటుందని, దీనిని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా రాజమౌళి అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. బేసిక్ గానే రాజమౌళి సినిమాలు అంటేనే సంవత్సరాలు, సంవత్సరాలు తెరకేక్కిస్తుంటారు. మరి మహేష్ సినిమాని రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేయనున్నాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.అర్ సినిమాని ఈ ఏడాది జులైలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అక్కడినుంచి వచ్చే ఏడాదికి మారిపోయింది. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడడంతో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తరవాత మహేష్ తో సినిమాని పట్టాలేక్కించాలి అనుకుంటే మరో ఆరు నెలల టైం అయిన తీసుకుంటారు రాజమౌళి.. దీనితో సినిమా 2022లో షూటింగ్ మొదలు అవుతుంది. 2023లో ధియేటర్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక మహేష్ బాబు కూడా ఈ టైంలో సినిమాలను రెడీ చేసిపెట్టుకున్నారు. ప్రస్తుతం గీతాగోవిందం ఫేం పరుశురాంతో ఓ సినిమాని చేస్తున్నారు మహేష్.. ఈ సినిమా తరవాత అనిల్ రావిపూడి, అనిల్ సుంకరలతో ఓ సినిమాని, ఆ తర్వాత వంశీ పైడిపల్లి, దిల్ రాజులతో మరో సినిమాని చేసేందుకు మహేష్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాల తర్వాత రాజమౌళితో సినిమాకి మహేష్ రెడీగా ఉంటాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories