రాజమౌళి కోసం జనవరి నుండి అందుబాటులో ఉండనున్న మహేష్ బాబు

Mahesh Babu will Give 20 Days of Dates Per Month for Rajamouli
x

రాజమౌళి కోసం జనవరి నుండి అందుబాటులో ఉండనున్న మహేష్ బాబు

Highlights

రాజమౌళి కోసం జనవరి నుండి అందుబాటులో ఉండనున్న మహేష్ బాబు

Mahesh Babu: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి సినిమాలో తన లుక్కు కోసం మేకోవర్ ఉంటుందని అందుకోసం జనవరి నుంచి అందుబాటులో ఉండమని చెప్పారట. ఇక మహేష్ బాబు నెలలో 20 రోజులు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి సినిమా కథ ఎలా ఉండబోతుందో అని ఇప్పటికే చాలా పుకార్లు వినిపించాయి. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు మాత్రం పెరుగుతూనే వస్తున్నాయి. కానీ ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories