Namrata:"వాళ్ల విషయంలోనే నాకు మహేష్ బాబుకి గొడవలు వస్తాయి" అని అంటున్న నమ్రత

Mahesh Babu Wife Told Interesting Things About Their Love Story
x

Namrata:"వాళ్ల విషయంలోనే నాకు మహేష్ బాబుకి గొడవలు వస్తాయి" అని అంటున్న నమ్రత

Highlights

Namrata: తమ ప్రేమ కథ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన మహేష్ బాబు భార్య

Namrata: "వంశీ" సినిమా సెట్స్ లో మొదటిసారిగా నమ్రత శిరోద్కర్ ను కలుసుకున్నారు మహేష్ బాబు. వీరి స్నేహం ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే మహేష్ బాబు మరియు నమ్రత లకు గౌతమ్ మరియు సితారాలు కూడా జన్మించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నమ్రత తమ లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. "మహేష్ బాబు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన రోజు అది," అన్నా నమ్రత పెళ్లి తర్వాత తన ప్రపంచం పూర్తిగా మారిపోయింది మాతృత్వాన్ని పొందడం ఒక గొప్ప అనుభూతి అని అన్నారు.

"సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేసే దాన్ని. కానీ అది బోర్ కొట్టడంతో సినిమాల్లోకి అడుగు పెట్టాను. నటిగా నేను చేసిన ప్రతి సినిమాని చాలా ఆస్వాదిస్తూ చేశాను. అప్పుడే మహేష్ బాబు ను కలిశాను. మేము పెళ్లి చేసుకున్నాం. కాబోయే భార్య ఎలా ఉండాలి అనే విషయంలో మహేష్ బాబుకి చాలా స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యాను. పెళ్లి అయ్యాక నాకు అవకాశాలు వచ్చాయి. కానీ నటించాలని ఉద్దేశం నాకు లేదు. నాకు మహేష్ కి మధ్య ఎప్పుడూ గొడవలు రావు. ఏమైనా వచ్చినా కూడా అది పిల్లల విషయంలోనే అయి ఉంటుంది. పిల్లలు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతారు. ఎందుకంటే ఆయన దేనికీ నో అనరు. నేను మాత్రం నో చెబుతూ ఉంటాను. అలా మా మధ్య సరదా వాదనలు కూడా జరుగుతూ ఉంటాయి," అని చెప్పుకొచ్చారు నమ్రత. ఇక మహేష్ బాబు సినిమాల్లో తనకి "పోకిరి" సినిమా చాలా ఇష్టమని అందులో పంచ్ డైలాగ్ లు తనకి చాలా బాగా నచ్చాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories