భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన "సర్కారు వారి పాట"...

Mahesh Babu Sarkaru Vaari Paata Huge Pre Release Business | Tollywood Live News
x

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన "సర్కారు వారి పాట"...

Highlights

Sarkaru Vaari Paata:మహేష్ బాబు త్వరలో నే "సర్కారు వారి పాట" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు...

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో నే "సర్కారు వారి పాట" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "గీత గోవిందం" డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. "మహానటి" బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12 న థియేటర్లలో విడుదల కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన " మ మ మహేషా" పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. మరి అంచనాలకు మించి కలెక్షన్లు చేసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

ఏరియా వైజ్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా ఉంది:

నైజాం (తెలంగాణ): రూ. 36కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 13 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 12.50 కోట్లు

ఈస్ట్: రూ. 8.50 కోట్లు

వెస్ట్: రూ. 7 కోట్లు

గుంటూరు: రూ. 9 కోట్లు

కృష్ణా: రూ. 7.5 కోట్లు

నెల్లూరు:రూ. 4 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 96.50 కోట్లు

కర్ణాటక : రూ. 8.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : రూ. 3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 11 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ గా 120 కోట్లు నమోదు చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 121 కోట్ల షేర్ రాబట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories