MaheshBabu Babu Next Movie: ఇండస్ట్రీలో హాట్ టాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!

Mahesh Babu Next Movie with Sandeep Reddy Vanga: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్‌పై చర్చలు ఊపందుకున్నాయి.

Rishvik
Published on: 17 Feb 2026 5:01 PM IST
MaheshBabu Babu Next Movie: ఇండస్ట్రీలో హాట్ టాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!
X

MaheshBabu Babu Next Movie: ఇండస్ట్రీలో హాట్ టాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!

Mahesh Babu Next Movie with Sandeep Reddy Vanga: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్‌పై చర్చలు ఊపందుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సెన్సేషనల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా త్వరలో 'సూపర్ స్టార్' మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి'లో మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత.. సందీప్ రెడ్డి వంగా మూవీ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ లేదా నిర్మాత సునీల్ నారంగ్ నిర్మించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా డేట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వంగా–మహేష్ కలిసి 'డెవిల్' అనే ప్రాజెక్ట్‌పై చర్చలు జరిపినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఇద్దరి షెడ్యూల్స్ కుదరడంతో కొత్త ప్రాజెక్ట్ సాకారం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో హీరోగా 'రెబల్ స్టార్' ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి వరకు పూర్తవనుంది. మరోవైపు రాజమౌళి సినిమా వారణాసి విడుదలైన తర్వాత మహేష్ బాబు ఫ్రీ అవుతారు. ఈ సినిమా 2007 వేసవిలో రిలీజ్ కానుంది. దాదాపుగా ఒకే సమయంలో స్పిరిట్ నుంచి వంగా, వారణాసి నుంచి బాబు రిలీజ్ అవుతారు. ఆ టైమ్‌లైన్ ఇద్దరి కాంబినేషన్‌కు అనుకూలంగా మారింది.

ఇక బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రస్తుతం 'రామాయణ'తో బిజీగా ఉన్నారు. దాంతో 'యానిమల్ పార్క్' ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వంగా తదుపరి ప్రాజెక్ట్‌గా మహేష్ బాబు సినిమా చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వంగా–మహేష్ కాంబినేషన్ కుదిరితే.. పాన్ ఇండియా స్థాయిలో భారీ సంచలనంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో వంగా సెన్సేషనల్ డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. స్పిరిట్ రిలీజ్ అయ్యాక వంగా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story