Bhola Shankar: చిరు "భోళా శంకర్‌" మోషన్ పోస్టర్ విడుదల చేసిన మహేష్

Mahesh Babu launched Chiranjeevi New Movie Bhola Shankar Motion Poster on Chiru Birthday Special
x

"భోళా శంకర్‌" మోషన్ పోస్టర్ విడుదల (ట్విట్టర్ ఫోటో)

Highlights

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్‌" గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ "వేదాళం" చిత్రానికి...

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్‌" గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ "వేదాళం" చిత్రానికి రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను వదిలారు.

ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు మీ సినిమా టైటిల్ 'భోళా శంకర్'ని లాంచ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను.నా స్నేహితుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, నా ఫేవరెట్ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న మెగాస్టార్ ఆయురారోగ్యాలతో గొప్ప విజయాలతో ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ సర్.." అంటూ మహేష్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories