"సర్కారు వారి పాట" సినిమా కి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

Mahesh Babu is Demanding High Remuneration | Telugu News
x

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న మహేష్ బాబు

Highlights

*భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu Remuneration: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్లు అందుకుంటూ రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. సముతిరఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా ముందుకు దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 55 నుంచి 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా మళ్లీ సినిమా నుంచి వచ్చే ప్రాఫిట్ లో కూడా కొంత భాగాన్ని రెమ్యునరేషన్ రూపంలో తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక "సర్కారు వారి పాట" సూపర్ హిట్ అవడంతో మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం ఏకంగా 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కి 100 కోట్లు చొప్పున, పవన్ కళ్యాణ్ 55 కోట్లు, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ 45 నుంచి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories