కృష్ణ చనిపోయిన రోజు ప్రాణం పోసుకున్న ఒక పసి ప్రాణం

Mahesh Babu foundation Saved Mokshith Sai Life
x

కృష్ణ చనిపోయిన రోజు ప్రాణం పోసుకున్న ఒక పసి ప్రాణం

Highlights

* కృష్ణ చనిపోయిన రోజే మహేష్ బాబు స్థాపించిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఒక హార్ట్ సర్జరీ జరిగింది

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈమధ్యనే 79 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణ అకాల మరణం తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడిప్పుడే మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ మృతి నుండి కోలుకుంటున్న ఘట్టమనేని కుటుంబానికి కృష్ణ మరణం మరింత కృంగదీసింది. కృష్ణ కి నివాళిగా మహేష్ బాబు ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే కృష్ణ చనిపోయిన రోజు ఒక ఘటన జరిగింది.

కృష్ణ చనిపోయిన రోజే మహేష్ బాబు స్థాపించిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఒక హార్ట్ సర్జరీ జరిగింది. కృష్ణ ప్రాణాలు విడిచిన రోజు మహేష్ బాబు ఫౌండేషన్ కారణంగా ఒక పసి ప్రాణం ప్రాణం పోసుకుంది. అయితే ఇది మహేష్ బాబు "ఖలేజా" సినిమాలో జరిగిన ఒక సన్నివేశాన్ని మనకి గుర్తు చేస్తుంది. "ఖలేజా" సినిమాలో కూడా సిద్ధ పాత్ర చనిపోయిన రోజు పాలి లో ఒక పసి వాడు ప్రాణం పోసుకుంటాడు. ఇది యాదృశ్చికంగా మహేష్ బాబు నిజ జీవితంలో కూడా ఒక విధంగా జరిగింది అని అభిమానులు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు మరియు కుటుంబం ఇంకా కృష్ణ మృతి నుండి కోలుకోవాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories