మహేష్ కొత్త సెంటిమెంట్.. టీ గ్లాస్‌ తో కూల్ హిట్స్

మహేష్ కొత్త సెంటిమెంట్.. టీ గ్లాస్‌ తో కూల్ హిట్స్
x
Highlights

సినిమా ఇండస్ట్రీ నడిచేది ఎక్కువశాతం సెంటిమెంట్స్ పైన ఎవరి సెంటిమెంట్స్ వారికీ ఉంటాయి.

సినిమా ఇండస్ట్రీ నడిచేది ఎక్కువశాతం సెంటిమెంట్స్ పైన ఎవరి సెంటిమెంట్స్ వారికీ ఉంటాయి. నిర్మాత, దర్శకుడు, హీరో ఇలా ఎవరు దీనికి అతీతం కాదు. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయనకి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. అయన సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడు రారు.. మొదటినుంచి కూడా అయన సినిమాలకు మూడు అక్షరాలు ఉండేలా చూసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా చివరలో 'డు' అనే అక్షరం కచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే రాజకుమారుడు నుంచి శ్రీమంతుడు వరకు ఇదే ఫాలో అయ్యారు మహేష్..

ఇప్పుడు మహేష్ మరో సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతున్నారు. సినిమాలో అయన టీ తాగుతున్న పోస్టర్స్ ని సినిమా సినిమాకి రిలీజ్ చేస్తూ వస్తున్నారు మహేష్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కి స్టీల్‌ గ్లాస్‌లో టీ తాగుతున్న పోస్టర్‌ను బయటకొదలగా.. 'బిజినెస్‌మ్యాన్‌', 'శ్రీమంతుడు', 'మహర్షి' చిత్రాల్లో గాజు గ్లాస్‌లో టీ తాగుతున్న పోస్టర్లను ప్రేక్షకులకు చూపించారు. తాజాగా ఇదే సెంటిమెంట్ ని సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా కొనసాగించారు మహేష్.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

ఇందులో మహేష్ రష్మిక రొమాంటిక్‌ లుక్స్‌తో వెనకకు తిరిగి మహేష్‌ను చూస్తుంటే మహేష్‌ చేతిలో టీ గ్లాస్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దీనితో సినీ ప్రేక్షకులు మహేష్ హాట్ గా టీ తాగుతూ కూల్ గా హిట్టు కొడుతున్నాడని అనుకుంటున్నారు.

మహేష్ బాబు తాజాగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. విడుదలైన అన్ని ధియేటర్ల నుంచి సినిమాకి మంచి స్పందన వస్తుంది. పొంగల్ కి పర్ఫెక్ట్ మూవీ అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాని దిల్ రాజు అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories