మహేష్ రాజమౌళి మూవీ అప్డేట్.. కీలకమైన యాక్షన్ ఘట్టం ఇదేనంటూ..

Rajamouli: ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రపంచంలోని కొన్ని విభిన్న ప్రదేశాలలో జరగబోతుందని చెప్పారు

R Tripura Malini
Published on: 29 Oct 2022 1:07 PM IST
The shooting of Rajamouli And Mahesh Babu Film Will Take Place In Japan
X

మహేష్ బాబు సినిమా షూటింగ్ జపాన్ లో జరుగుతుంది అంటున్న రాజమౌళి

SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "ఆర్ ఆర్ ఆర్" సినిమా ప్రమోషన్స్ జపాన్లో జరుగుతున్న కారణంగా చిత్ర ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన రాజమౌళి ఆ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రపంచంలోని కొన్ని విభిన్న ప్రదేశాలలో జరగబోతుందని అన్న రాజమౌళి ఒక ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాన్ని జపాన్లో షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో రాజమౌళి జపాన్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారని చెప్పుకోవచ్చు.

R Tripura Malini

R Tripura Malini

Next Story