ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో.. వాడే మగాడు: మహేష్

ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో.. వాడే మగాడు:  మహేష్
x
Mahesh Babu file photo
Highlights

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను ఉరి తీయాలంటూ స్థానికులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కాగా..దేశ రాజధాని ఢిల్లీలో సైతం నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ స్ట్రీట్ లో యువత భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై సినీనటులు కూడా స్పందిస్తున్నారు. శనివారం మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ఘటనపై తన స్పందన తెలియజేశారు. అందరిలా ట్విట్‌తోనో కాకుండా మహిళలపై జరుగుతున్న దాడులను కవిత్వం రూపంలో తెలియజేశారు. మహేష్ చెప్పిన కవిత్వం వైరల్ అవుతోంది. మహేశ్ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు పెట్టుకుంటారు. మహేశ్ బాబు చెప్పిన కవిత్వం ఏంటో తెలుసా మీరే వినండి.

ఎవరి కళ్ళలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో,

ఎవరి మాట మన్ననగా ఉంటుందో,

ఎవరి మనసు మెత్తగా ఉంటుందో,

ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో,

ఎవరికీ ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో,

ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో.

వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో,

ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో,

స్త్రీకి శక్తింది,

గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో,

ఎవరికి దగ్గరగా ఉంటే,

వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో,

అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు,

ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు

అంటూ మహేశ్ తన కవిత్వాన్ని వాయిస్ ఓవర్ రూపంలో తెలిపారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories