డబ్బింగ్ చెప్పనున్న సితార...

డబ్బింగ్ చెప్పనున్న సితార...
x
Highlights

తెలుగు వెండితెరపై మహేష్ బాబు అగ్ర హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయన కుమారుడు గౌతమ్ కూడా ఇప్పటికే తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. మహేష్ బాబు ,...

తెలుగు వెండితెరపై మహేష్ బాబు అగ్ర హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయన కుమారుడు గౌతమ్ కూడా ఇప్పటికే తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఇప్పుడు అయన గారాల పట్టి సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ తెర మీదికి కాదు. తెర వెనుక మాత్రమే..

సితార హాలీవుడ్ సినిమాకి తన గొంతును అందించనుంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ నిర్మించిన చిత్రం `ఫ్రోజన్-2'.. ఈ సినిమాలో చిన్నారి పాత్ర అయిన ఎల్సాకు సితార డబ్బింగ్ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది. ఇక ఎల్సా పెద్దయ్యాక ఆ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పనుంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories