వీరిద్దరి కాంబో పట్టాలెక్కుతుందా?

Mahesh Babu
x
Mahesh Babu
Highlights

'భరత్ అనే నేను' సినిమాతో చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా లో మహేష్ సరికొత్త లుక్స్ తో ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేయనున్నాడు.

'భరత్ అనే నేను' సినిమాతో చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా లో మహేష్ సరికొత్త లుక్స్ తో ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేయనున్నాడు.ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'వన్ నేనొక్కడినే' సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ మళ్ళీ సుక్కు కి ఛాన్స్ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. తాజా సమాచారం ప్రకారం కొన్ని రోజులు రోజుల కిందటే సుకుమార్ మహేష్ బాబు కు ఒక పీరియడ్ స్క్రిప్ట్ ను నెరేట్ చేశారట. మొదట బానే ఉంది అనుకున్నా పీరియడ్ డ్రామా అంటే రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి, మహేష్ ఆ స్క్రిప్ట్ కు నో చెప్పాడట. ప్రస్తుతం సుకుమార్ మహేష్ కోసం ఒక థ్రిల్లర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయబోతున్నాడని టాక్. 'మహర్షి' సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు తన కథ తో మహేష్ ను మెప్పిస్తే, సుకుమార్ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళిపోవచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలో మొదలవుతుందా లేక ఇంకా సమయం పడుతుందా అనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories