logo
సినిమా

శాటిలైట్ రైట్స్ తో అదరగొడుతున్న మహర్షి

శాటిలైట్ రైట్స్ తో అదరగొడుతున్న మహర్షి
X
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25 వ చిత్రం 'మహర్షి' కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25 వ చిత్రం 'మహర్షి' కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. తాజాగా 'మహర్షి' సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అక్షరాలా 11 కోట్లు చెల్లించి మరీ కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా అంతే పెద్ద మొత్తం నిర్మాతలకు లభించింది. తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు 16.8 కోట్లు పెట్టి కొన్నారు.

ఇప్పటి దాకా మహేష్ బాబు ఏ సినిమా ని కూడా జెమినీ వారు ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి కొన్న దాఖలాలు లేవు. ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం రూరల్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. దిల్ రాజు, పీ వీ పీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Next Story