Top
logo

మహర్షి మే వేడుకకు ముహూర్తం ఫిక్స్

మహర్షి మే వేడుకకు ముహూర్తం ఫిక్స్
X
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహర్షి' సినిమా పై భారీ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను దర్శకనిర్మాతలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రచారాలు జోరు మరింత పెంచనున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు కొన్ని పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక వచ్చే నెల మే 1వ తేదీన పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్ లో జరగనుంది. ఇక ఈ వేడుకకు వేలల్లో అభిమానులు వస్తారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.

Next Story