ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసుపై నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

Maharashtra Minister Nawab Malik Sensational Comments on Aryan Khan Drugs Case
x

ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసుపై నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో)

Highlights

* ఆర్యన్‌ఖాన్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారని కామెంట్ * సమీర్ వాంఖడేతో బీజేపీ నేత ఆడిన డ్రామా అంటూ ఫైర్

Aryan Khan Drugs Case: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మహరాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కౌంటర్ కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మరోసారి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ అరెస్ట్ దగ్గర నుంచీ షారుఖ్‌కు బెదిరింపులు మొదలయ్యాయన్నారు.

క్రూయిజ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూజా దడ్లానీ పేరు బయటకు వచ్చినప్పట్నుంచి మాట్లాడొద్దంటూ షారూఖ్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా షారూఖ్ నోరు విప్పి మాట్లాడాలని, ఆర్యన్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారన్న విషయం చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆర్యన్ అరెస్ట్ అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో నవాబ్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇక ఈ కిడ్నాప్ డ్రామాకు మాస్టర్ మైండ్ బీజేపీ నేత మోహిత్ కంబోజ్ అని ఆరోపించారు నవాబ్ మాలిక్. ఆర్యన్ అసలు క్రూయిజ్ టికెట్టే కొనలేదన్నారు. ప్రతీక్ గాబా, ఆమిర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు ఆర్యన్‌ను తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసు పూర్వ విచారణ అధికారి అయిన సమీర్ వాంఖడేతో కలిసి మోహిత్ కంబోజ్ ఆర్యన్‌ను కిడ్నాప్ చేశారన్నారు.

తర్వాత షారూఖ్ తో డబ్బు బేరం పెట్టాడని సంచలన ఆరోపణ చేశారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి ఓ పార్టీలో వాంఖడేని మోహిత్ కలిశాడని చెప్పారు. క్రూయిజ్ పార్టీకి వెళ్లిన రిషభ్ సచ్దేవా, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్ వాలాను విడిచిపెట్టారన్నారు.

మరోవైపు నవాబ్ మాలిక్ వ్యాఖ్యలపై ఎన్సీబీ కౌంటర్ ఇచ్చింది. నవాబ్ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే కోర్టుకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించింది. ఇదే సమయంలో నవాబ్ మాలిక్‌పై వాంఖడే తండ్రి 1.25 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories