MAA Elections: హేమ "మా" గౌరవాన్ని దెబ్బతీస్తుంది

మా ప్రెసిడెంట్ నరేష్, హేమ (ఫైల్ ఇమేజ్)
MAA Elections: మా నిధుల దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ ఆరోపణ * హేమ ఆరోపణలపై నరేష్, జీవిత సీరియస్
MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలను నరేష్, జీవిత ఖండించారు. హేమ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు్న్నామన్నారు. హేమ ఆరోపణలపై నరేష్, జీవిత వివరణ ఇచ్చారు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మా లో ప్రస్తుతం 4 కోట్ల 70 లక్షల రూపాయలు ఉన్నాయని నరేష్ తెలిపారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా తాము మా సభ్యుల కోసం ఎన్నో పనులు చేశామని స్పష్టం చేశారు. మా ఫండ్‌ను టచ్ చేయకుండా తామకున్న ఇమేజ్‌తో ఫండ్ తెచ్చుకున్నామన్నారు. ఇండస్ట్రీ పెద్దలు, ఫ్రెండ్స్ తమకు ఫండ్స్ విషయంలో సహకరించారని నరేష్ అన్నారు.
కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్ జరపడానికి రెడీగా ఉందని.. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలా అని మీటింగ్‌లో చర్చించామన్నారు.
'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి చూపు సినిమా పరిశ్రమపై పడింది. మా కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
చెత్తకుప్పలను తలపిస్తున్న చార్ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని...
22 May 2022 2:00 PM GMTJogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMTబారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..
22 May 2022 12:30 PM GMTPawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని...
22 May 2022 11:51 AM GMT