logo
సినిమా

MAA Elections: అక్టోబర్‌ 10న 'మా' ఎన్నికలు

MAA Association Elections on October 10th
X

అక్టోబర్ 10న మా ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

Highlights

MAA Elections: రాజుకుంటున్న "మా" ఎన్నికల వేడి

MAA Elections: మా ఎన్నిక వేడి రాజుకుంటుంది. పైకి అంతా సైలెంట్‌గా ఉన్నా లోపల మాత్రం ఎవరి ప్రచారాలు వాళ్లు చేసుకుంటున్నారు. నిత్యం ఓటర్‌తో టచ్‌లో ఉంటూ తమకే ఓటు వేయాలని, తమ ఫ్యానల్‌నే గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాదు. ప్రతి రోజు వేరు వేరు చోట్ల పార్టీలు ఇస్తూ తమను గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు.

ఈ వీకెండ్‌ నరేష్‌ చాలా మంది సినీ ప్రముఖులకు పార్టీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నరేష్‌ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కానీ. మంచు విష్ణుకి సపోర్ట్‌గా ఉన్నాడు. అంతేకాదు తనసైడ్‌ ఉన్న దాదాపు 150 మంది సభ్యులతో టచ్‌లో ఉంటున్నారు. 150 మంది ఓట్లు మంచు విష్ణుకి పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక ప్రకాష్‌ రాజ్‌ కూడా ప్రతిరోజు తన ఫ్యానల్‌ సభ్యులతో మీటింగ్‌లు పెడుతున్నారు. అసోసియేషన్‌ సభ్యులతో టచ్‌లో ఉండటమే కాదు వారి అవసరాలు ఏమిటో తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి కంటే ప్రచారంలో ముందు ఉన్న ప్రకాష్‌ రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ కూడా ఉంది. ఎలక్షన్స్‌కు ఇంకా నెలరోజుల టైమ్‌ ఉండగా పార్టీలు ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

Web TitleMAA Association Elections on October 10th
Next Story