RRR Movie Update: 'ఆర్‌ఆర్‌ఆర్' ఫ్రీ రిలీజ్‌ బిజినెస్.. ఆ రాష్ట్రంలో అంతుందా?

RRR movie
x

ఆర్ఆర్ఆర్ ఫైల్ ఫోటో 

Highlights

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). ...

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). స్వాతంత్ర్య సమరవీరుల అల్లురి సీతారామరాజు(రామ్ చరణ‌్), కొమరం భీం( ఎన్టీఆర్) పాత్రల్లో ఇద్దరు హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైనా ఈ సినిమా చెర్రీ, తారక్ లూక్స్ పై ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటిచించ సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ని భారీగా జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం​ చేస్తూ బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తమిళనాడు థియేట్రికల్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. 'బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది'

ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ రైట్స్ రూ.45 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' తమిళనాడులో సుమారు 78 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.



Show Full Article
Print Article
Next Story
More Stories