Love Story: 'సారంగ దరియా' మరో రికార్డ్.. సాయి పల్లవి క్రేజ్ మాములుగా లేదుగా..

Sai Pallvi Love Story Movie Song
x

సాయి పల్లవి ఫైల్ ఫోటో 

Highlights

Love Story: `సారంగ దరియా` సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

Love Story: `సారంగ దరియా` సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్‌ రావడం పట్ల 'లవ్‌స్టోరీ' యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తుంది.

మంగ్లీ ఆలపించిన ఈ గీతం. సాయి పల్లవి స్టెప్పులకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌కి, పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలోదర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం 'లవ్ స్టోరి'. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు.

గతంలో 2020లో అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అల వైకుంఠపురంలో.. గత ఏడాది విడుదల అయిన ఈ చిత్రంలో సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. థమన్ అందించిన బాణీలు అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించాయి. ముఖ‌్యంగా సామజవరగమణ, బుట్టబొమ్మ, రాములో రాములా, సాంగ్స్ ఐతే సోషల్ మీడియాలో మోతమోగాయి. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.

ఇటీవలే ఈ పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను చేరుకుంది.'బుట్ట బొమ్మ' పాటకు 18 రోజులు 50 మిలియన్ వ్యూస్ రాగా, 'రాములో రాములా' పాటకు 27 రోజుల్లో వచ్చాయి. 'సారంగ దరియా'తరవాతే కంటే 'బుట్ట బొమ్మ','రాములో రాములా'ఉన్నాయి. ఇకపోతే గతంలో ధనుష్‌తో సాయి పల్లవి హీరోహీరోయిన్లగా చేసిన 'రౌడీ బేబీ' సాంగ్ ఒక్కటే 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్‌కు వచ్చి 'సారంగదరియా'కంటే ముందుంది. మరో మైలు రాయిని చేరుకోవడానికి

ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం 'లవ్ స్టోరి' కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మళ్లీ థియేటర్లు తెరుచుకున్న తర్వాతే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories