OTT Movie: డబ్బుల కోసం కూతుళ్లను అమ్మే తండ్రి.. అక్క కోసం అలాంటి పని చేసే చెల్లి

Love Sonia A Heart Wrenching Drama on Human Trafficking and the Dark Reality of the Sex Trade
x

OTT Movie: డబ్బుల కోసం కూతుళ్లను అమ్మే తండ్రి.. అక్క కోసం అలాంటి పని చేసే చెల్లి

Highlights

OTT Movie: ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ పామ్ లు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. రోజుకు పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.

OTT Movie: ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ పామ్ లు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. రోజుకు పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. నచ్చిన సినిమాను తమకు నచ్చిన సమయంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని కథలు ఎంటర్ టైన్ చేస్తే.. కొన్ని మాత్రం మెసేజ్ లను అందజేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఓటీటీలో డబ్బుల కోసం కూతుళ్లను అమ్మే తండ్రి కథకు సంబంధించిన మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా ‘లవ్ సోనియా’ (Love Sonia). 2018 లో రిలీజ్ అయిన ఈ హిందీ డ్రామా మూవీ తబ్రేజ్ నూరానీ దర్శకత్వంలో తెరకెక్కింది. దీనిని డేవిడ్ వోమార్క్ నిర్మించారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, రిచా చద్దా, రియా సిసోడియా, ఫ్రీదా పింటో, డెమీ మూర్, అనుపమ్ ఖేర్, ఆదిల్ హుస్సేన్, రాజ్‌కుమార్ రావ్ తదితరులతో పాటు టైటిల్ క్యారెక్టర్‌లో బ్యూటీ క్వీన్ మృణాల్ ఠాకూర్ నటించారు. లవ్ సోనియా 21 జూన్ 2018న లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఈ సినిమా భారతదేశంలో 14 సెప్టెంబర్ 2018న థియేటర్‌లలో రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ (Jio hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో రెండింటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే.. ఓ మారుమూల పల్లెటూరులో మల్లేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. ఇతనికి పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు ఉంటారు. వీళ్ళిద్దరూ హై స్కూల్ చదువుకుంటూ ఉంటారు. దాంతో పాటు వ్యవసాయంలో సోనియా తండ్రికి సాయం చేస్తూ ఉంటుంది. ప్రీతి మాత్రం అంతగా పని చేయకపోవడంతో తనపై కోప్పడుతూ ఉంటాడు మల్లేషం. అదే ఊర్లో ఉండే అమర్, సోనీయాను ప్రేమిస్తుంటాడు.

ఒకసారి చాలా రోజులు వర్షాలు పడకపోవడంతో, మల్లేషానికి కష్టాలు మొదలవుతాయి. అతని బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఠాగూర్ అనే వ్యక్తి. అలా డబ్బు ఆశ చూపించి పెద్ద కూతురు ప్రీతిని అమ్మేస్తాడు. ఆమెను తీసుకువెళ్లి ఠాగూర్ ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కి అమ్మేస్తాడు. అక్క దూరం అవడంతో చెల్లి సోనియా చాలా బాధపడుతుంది. తనను వెనక్కి తెచ్చుకోవాలని వెతుక్కుంటూ ముంబైకి వెళ్తుంది.

అక్కడ తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఏరియాలో ఒక వ్యక్తి సోనియాను బాగా టార్చర్ చేస్తాడు. తనను బాగా భయపెట్టి కస్టమర్ల దగ్గరకు పంపిస్తాడు. లేకపోతే మీ అక్కను వెతికి చంపేస్తానని భయపెడతాడు. చేసేదేంలేక తను కూడా అదే పనిలో దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత సోనియాను విదేశాలకు అమ్మేస్తారు. అక్కడ తనని బాగా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారు. సోనియా తన అక్కని కలుస్తుందా? అమర్ సోనియాని వెతుక్కుంటూ వస్తాడా? మల్లేశం తను చేసిన తప్పుని తెలుసుకుంటాడా? లాంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories