మాస్టర్" డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్

Lokesh Kangaraj is Going To Do A Movie With Tollywood Star Hero
x

టాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా చేయబోతున్న లోకేష్ కనగారాజ్

Highlights

Lokesh Kanagaraj: టాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా చేయబోతున్న లోకేష్ కనగారాజ్

Lokesh Kanagaraj: ఈమధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయారు. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా విశాఖపట్నంలోనే జరగనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ డైరెక్టర్ మరెవరో కాదు లోకేష్ కనగరాజ్. కార్తీ హీరోగా నటించిన "ఖైదీ" సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ మధ్యనే విజయ్ మరియు విజయ్ సేతుపతి లతో "మాస్టర్" సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

తాజాగా లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ కి ఒక స్టోరీ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. చెర్రీ కనుక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే షూటింగ్ సెట్స్ పైకి వెళుతుంది. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న "విక్రమ్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఫాహాధ్ ఫాసిల్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య కూడా ఒక క్యమియో పాత్రలో కనిపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories