కరోనా క్రైసిస్ భారీగా విరాళాలు..

కరోనా క్రైసిస్ భారీగా విరాళాలు..
x
Highlights

రోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌ చెరో 25 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, రవితేజ 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. సినీ తారల నుంచి మంచి స్పందన రావడంతో హీరో చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఇప్పటివరకూ సినీ కార్మికుల కోసం సినీ తారలు ఇచ్చిన విరాళాలు ఇలా ఉన్నాయి..

చిరంజీవి: కోటి రూపాయలు

♦ నాగార్జున: కోటి రూపాయలు

♦ దగ్గుబాటి కుటుంబం: కోటి రూపాయలు

♦ తారక్‌: రూ.25 లక్షలు

♦ మహేశ్‌బాబు: రూ.25 లక్షలు

♦ రామ్‌చరణ్‌: రూ.30 లక్షలు

♦ కార్తికేయ: రూ.2 లక్షలు

♦ లావణ్య త్రిపాఠి: రూ.లక్ష

♦ నాగచైతన్య: రూ.25 లక్షలు

♦ వరుణ్‌ తేజ్‌: రూ.20 లక్షలు

♦ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్: రూ.10 లక్షలు

♦ శర్వానంద్‌: రూ.15 లక్షలు

♦ విశ్వక్సేన్‌ :రూ.5 లక్షలు

♦ రవితేజ :రూ.20 లక్షలు

♦ వెన్నల కిషోర్ : రూ . 2 లక్షలు

♦ సంపూర్నేష్ బాబు : రూ.లక్ష

ఇక కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లు అర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories